హలో bigg Boss వ్యువర్స్
ఈరోజు బిగ్ బాస్, చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది.
మోర్నింగ్ wakeup సాంగ్ తో మన contestants ఫ్రెష్ గా day స్టార్ట్ చేసారు.
మోర్నింగ్ మస్తి లో భాగంగా మోనాల్ ఇంటి సభ్యులకి, తెలుగు rhymes నేర్పించాల్సి ఉంటుంది.
బావ బావ పన్నీరు అనే తెలుగు rhyme చాలా క్యూట్ గా నేర్పిస్తుంది.
housemates అందరు కూడా, happy గా ఎంజాయ్ చేస్తారు.
తర్వాత gangavva మరియు అభిజిత్ నిన్నటి నామినేషన్ ప్రక్రియ గురించి మాట్లాడుకుంటారు. అలా ఫొటోస్ మంటలో వేయడం బాగాలేదు అని
తనకి నిద్ర కూడా పట్టలేదు అని అవ్వ అభి తో చెప్తుంది. ఆటనీ ఆటలా తీసుకోవాలి అవ్వ అని అభిజిత్ అంటాడు.
మోనాల్, అఖిల్, మరియు అవినాష్, funny discussion చేస్తారు. సుజాత డ్రెస్సింగ్ చూసి, ఈరోజు తను ఒక సెవెంటీస్ హీరోయిన్ లాగ ఉంది అంటూ మోనాల్ అవినాష్ అంటారు
ఆ తరువాత బిగ్ బాస్ ఈ వారం ఇంటి సభ్యులకి ఉక్కు హృదయం అనే టాస్క్ పేరుతో ఒక టాస్క్ ఇస్తారు. అందులో భాగంగా ఇంటి సభ్యులందరినీ రెండు టీమ్స్ గా బిగ్ బాస్ విడదీస్తారు. ఒకటి రోబోల టీమ్ మరొకటి మనుషుల టీమ్. రోబో లందరూ చనిపోతే మనుషుల టీమ్ విజేతగా నిలుస్తారు. అలా కాకుండా ఒక్క రోబో ప్రాణాలతో ఉన్నా రోబోల టీమ్ విన్ అవ్తుంది.
మనుషుల టీమ్ గార్డెన్ ఏరియాలో ఉండాల్సి వస్తుంది. గ్యాస్, వాటర్ మరియు ఇంకేమైనా కూడా అవి రోబో టీమ్ ఆధీనంలో ఉంటాయి.
రోబోట్స్ కి సమయానుసారంగా బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోతూ వస్తుంది. దానిని కేవలం మనుషులు మాత్రమే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. మనుషులు ఛార్జ్ చేసినందుకు గ్యాస్, water access పొందవచ్చు.
గార్డెన్ ఏరియాలో ఒక సిల్వర్ బాల్ ఉంటుంది మనుషులు ఆ సిల్వర్ బాల్ నీ పగలకొడితే ఒక రోబో వెంటనే చనిపోతుంది. కాకపోతే, ఎవరిని అయితే చంపాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పి ఆ సిల్వర్ బాల్ నీ పగలకొట్టలి.
రోబోట్స్ ఆ సిల్వర్ బాల్ నీ కాపాడుకునే ప్రయత్నం చేయవచ్చు. ఒక్కసారి రోబో చనిపోతే మళ్ళీ రోబో బ్రతికే అవకాశం లేదు.
మనుషుల అవసరాలు రోబోల మీద ఆధారపడి ఉన్నాయి అలాగే రోబోల ప్రాణాలు మనుషుల మీద ఆధారపడి ఉన్నాయి.
Also see: Bigg Boss Voting Telugu guide
విజేతల టీమ్ నుంచి మాత్రమే కెప్టెన్ పోటీదారులు ఎంపిక చేయబడతారు. కెప్టెన్ కి ఇమ్యునిటీ ఉంటుంది అని bigg Boss గుర్తు చేస్తారు.
మనుషుల టీమ్:
అఖిల్
అమ్మ రాజశేఖర్
దివి
noel
మెహబూబ్
సుజాత
మోనాల్
సొహెల్
రోబోల టీమ్:
అభిజిత్
దేవి
లాస్య
గంగవ్వా
అవినాష్
కుమార్ సాయి
హారిక
అరియాన
గ్యాస్, లివింగ్ ఏరియా, బెడ్ రూం, వాటర్, బాత్రూమ్ కి access ఉంటుంది.
Also See: Fight between Harika and Mehaboob
రోబోల టీమ్ కి సిల్వర్ colour దుస్తులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనుషుల టీమ్ వాళ్ళకి పింక్ కలర్ దుస్తులు ఇవ్వడం జరుగుతుంది.
ఆ దుస్తులు వేసుకొని టాస్క్ కోసం అందరు రెడీ అవుతారు. కొంత మంది ఫుడ్ దాచిపెట్టడం చేస్తారు.
buzzer మ్రోగిన వెంటనే టాస్క్ స్టార్ట్ అవ్తుంది. రోబోల టీమ్ వాళ్ళు సిల్వర్ బాల్ నీ కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. మనుషుల టీమ్ పేరు చెప్పకుండా ఫస్ట్ సిల్వర్ బాల్ పగలకొట్టే ప్రయత్నం చేస్తారు.అలా చేయొద్దు అని ఇరు టీమ్స్ మధ్య గొడవ జరుగుతుంది.
ఆ తర్వాత మనుషుల టీమ్ ఒక నిర్ణయానికి వచ్చి దేవి పేరు చెప్పి ఆ సిల్వర్ బాల్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పగలకొట్టే ప్రయత్నం చేస్తారు. చివరకి ఆ సిల్వర్ బాల్ పగలకొట్టి రోబో అయిన దేవిని చంపేస్తారు.
మనుషుల టీమ్ దేనికైనా తెగించి ఉంటారు. వాళ్ళ అవసరాల కోసం రోబోలను ఏమి అడగరు. కెమెరాలు cover చేసి వాళ్ళ పర్సనల్ పనులు కూడా చేస్తారు. దీనితో బిగ్ బాస్ కెమెరాలు కవర్ చేయొద్దు అని warning ఇస్తారు.
మనుషుల టీమ్ ఏమి అడగట్లేదు అని రోబోల టీమ్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు కానీ విఫలమవుతారు.
రేపటి ఎపిసోడ్ లో దివి ఇంటి లోపల రోబోలకి చిక్కటం, మనుషుల టీమ్ కి లోపలికి వెళ్ళే అనుమతి లేదు కాబట్టి వాళ్ళు బయటనే ఉండి రోబోల మీద అర్వడం చూయిస్తారు.
గెలుపు ఎవరిది? రోబోలా? మనుషులా?