బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున యూట్యూబ్ స్టార్స్ మధ్యలో చిచ్చు పెట్టేసాడు. రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా, బిగ్ బాస్ ఒక ఫేక్ ఎలిమినేషన్ ప్లాన్ చేసారు.
ఇందులో భాగంగా నాగార్జున మోనాల్ మరియు హారిక ను సెపెరేట్ గ నిల్చోమ్మని చెప్పి వారి ముందు రెండు కలర్ వాటర్ గ్లాస్సెస్ పెట్టారు. హౌస్ మేట్స్ అందర్నీ ఆ గ్లాస్ లో ఉన్న కలర్ వాటర్ ని ఎంప్టీ గ ఉన్న బౌల్ లో ఫిల్ చెయ్ మన్నారు
ఎవరికీ ఎక్కువ ఎంప్టీ గ్లాస్సెస్ ఉంటె వాళ్ళు హౌస్ నుండి ఎలిమినేట్ అవుతారు అని చెప్పారు.
Also see: How to vote Bigg Boss Telugu Contestants
ఈ ప్రక్రియలో భాగంగా హౌస్ మేట్స్ అందరూ వారి కారణాలు చెప్తూ గ్లాస్సెస్ లోని వాటర్ బౌల్ లో ఫిల్ చేసారు.
మెహబూబ్ అవకాశం వచ్చినపుడు తాను హారిక ను మోనాల్ కన్నా వీక్ కంటెస్టెంట్ గా సెలెక్ట్ చేసాడు.
ఇది మనసులో పెట్టుకున్న హారిక వచ్చే ఎపిసోడ్ ప్రోమోలో మెహబూబ్ పై తన కోపాన్ని వ్యక్తం చేసినట్టుగా తేలుస్తుంది.
హారిక మరియు మెహబూబ్ వీళ్లిద్దరు యూట్యూబ్ స్టార్స్, వీళిద్దరూ ప్రేక్షకులకి వారి యూట్యూబ్ వీడియోస్ ద్వారా పరిచయం. హారిక దేతడి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోస్ చేస్తుంటుంది. గమ్మతేంటంటే వీళిద్దరికి బిగ్ బాస్ హౌస్ కి రాకముందే మంచి పరిచయం ఉంది.
ఏ ఫేక్ ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా వీళిద్దరి మధ్య పెద్ద వివాదమే మొదలయేలా కన్పిస్తుంది. చూదాం ముందు ముందు ఇంకేం జరగబోతుందో.