
దాదాపు నాలుగు వారలు గడిచిపోయాయి బిగ్ బాస్ 8 తెలుగు హౌస్ లో. ఇక ఉన్న కంటెస్టెంట్స్ అందరు, హౌస్ లో బాగా సెట్ అయ్యి ఆడుతున్న సమయంలో బిగ్ బాస్ ఒక బాంబు పేల్చాడు, అదే 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని.
దింతో ఒక్కసరిగా హౌస్ లో ఉన్నవాళ్ళందరూ షాక్ కి గురయ్యారు. అయితే ఆ 12 మందిని ఆపగలిగే పవర్ కూడా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకే ఇచ్చారు బిగ్ బాస్.
అది ఎలాగంటే, సమయానుసారం బిగ్ బాస్ కొన్ని టాస్క్లు ఇస్తుంటాడు, అవి రెండు క్లాన్లు కలిసి కట్టుగా ఆది రాబోయే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపొచ్చు.
కానీ అన్ని టాస్క్లుఅయితే గెలవలేకపోయారు. మొత్తం పన్నెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో నాలుగు ఎంట్రీస్ ఆపగలిగారు. ఇక మిగత ఎనిమిది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే హౌస్ లోకి రాబోతున్నాయి.
ఇప్పటికే, ఎవరు ఆ ఎనిమిది మంది కంటెస్టెంట్లు అని న్యూస్ మొత్తం బైటికి అయితే వచ్చేసింది.
ఇక ఆ ఎనిమిది కన్ఫార్మడ్ కంటెస్టెంట్లు ఎవరంటే
- హరి తేజ

- గౌతమ్ కృష్ణ

- మెహబూబ్

- నయని పావని

- రోహిణి

- ముక్కు అవినాష్

- టేస్టీ తేజ

- గంగవ్వ

అయితే ఎనిమిది మంది ఇంతముందు సీసన్స్ లో పాల్గొన్నవాళ్ళే అవ్వడంతో, బిగ్ బాస్ 8 తెలుగు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇచ్చేలాగే ఉన్నారు.
హరి తేజ ఇంతకముంది బిగ్ బాస్ సీజన్ 1 లో పార్టిసిపేట్ చేసింది. గౌతమ్ కృష్ణ కూడా బిగ్ బాస్ సీజన్ 7 లో పార్టిసిపేట్ చేసాడు. మెహబూబ్ బిగ్ బాస్ సీజన్ 4 లో పార్టిసిపేట్ చేసాడు, అలాగే, నయని పావని కూడా బిగ్ బాస్ సీజన్ 7 లో పార్టిసిపేట్ చేసింది.
ఇక రోహిణి సీజన్ 3 లో పాల్గొంది, ముక్కు అవినాష్ సీజన్ 4 లో పాల్గొన్నాడు, గంగవ్వ కూడా సీజన్ 4 లోనే పాల్గొంది. చివరగా టేస్టీ తేజ సీజన్ 7 లో పాల్గొన్నాడు.